Studio18 News - క్రీడలు / : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో బంగ్లా టీమ్ ముందే పాక్‌కు వెళ్లనుంది. బంగ్లా క్రికెట్ టీమ్ ముందే తమ దేశానికి రానుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. మంగళవారం వారు బంగ్లాదేశ్ నుంచి బయలుదేరనున్నారు. పాక్-బంగ్లా మధ్య ఆగస్ట్ 21-25, ఆగస్ట్ 30-సెప్టెంబర్ 3 వరకు వరుసగా రెండు టెస్టులు జరగనున్నాయి. బంగ్లా టీమ్ ముందే తమ దేశానికి రావడంపై పీసీబీ సీఈవో సల్మాన్ నసీర్ స్పందించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటి కోసం కొట్లాడ సరికాదని, సోదరభావం ఉండాలన్నారు. లాహోర్‌లో బంగ్లా టీంకు అదనంగా ట్రైనింగ్ సెషన్‌కు అనుమతిస్తామని తెలిపారు. లాహోర్‌తో పాటు రావల్పిండిలోనూ అదనపు ట్రైనింగ్ సెషన్ కోసం అవకాశం ఉందన్నారు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాక్‌తో టెస్ట్ తమకు చాలా ముఖ్యమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సీఈవో నిజాముద్దీన్ ఛౌదరి అన్నారు. తమ దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ టీమ్ ఆటపై దృష్టి పెట్టే పరిస్థితి లేదన్నారు. అందుకే ముందే పాక్‌కు వెళుతున్నట్లు చెప్పారు. పీసీబీ కూడా అంగీకరించిందన్నారు. ఇందుకు పీసీబీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Admin
Studio18 News