Sunday, 15 March 2026 02:07:51 PM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Amit Pasi: వచ్చాడు.. సెంచరీ బాదాడు!... వరల్డ్ రికార్డు సమం చేసిన బరోడా క్రికెటర్

Date : 08 December 2025 06:34 PM Views : 131

Studio18 News - క్రీడలు / : టీ20 అరంగేట్రంలోనే సెంచరీ బాదిన బరోడా కీపర్ అమిత్ పాసి ప్రపంచ రికార్డును సమం చేసిన 26 ఏళ్ల యువ ఆటగాడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సర్వీసెస్‌పై బరోడా విజయం ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గా గుర్తింపు బరోడా వికెట్ కీపర్-బ్యాటర్ అమిత్ పాసి సంచలనం సృష్టించాడు. తాను ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగి ప్రపంచ రికార్డును సమం చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా సోమవారం సర్వీసెస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఈ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 26 ఏళ్ల అమిత్ పాసి కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సుల సహాయంతో 114 పరుగులు సాధించాడు. కేవలం 44 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో, టీ20 అరంగేట్రంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన పాకిస్థాన్ ఆటగాడు బిలాల్ ఆసిఫ్ (114) రికార్డును సమం చేశాడు. పంజాబ్ ఆటగాడు శివమ్ భాంబ్రీ, హైదరాబాద్ ఆటగాడు అక్షత్ రెడ్డి తర్వాత కెరీర్ తొలి టీ20 మ్యాచ్ లోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా పాసి నిలిచాడు. వికెట్ కీపర్ జితేష్ శర్మ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీమిండియాకు సెలెక్ట్ కావడంతో, అతని స్థానంలో బరోడా జట్టులోకి వచ్చిన పాసి ఓపెనర్‌గా బరిలోకి దిగి అద్భుతంగా రాణించాడు. శివాలిక్ శర్మతో మూడో వికెట్‌కు 60 పరుగులు, కెప్టెన్ విష్ణు సోలంకితో కలిసి కేవలం 32 బంతుల్లోనే 75 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో బరోడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సర్వీసెస్ జట్టు 207 పరుగులకే పరిమితమవడంతో బరోడా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :