Thursday, 12 March 2026 03:43:39 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా

Date : 28 June 2025 11:55 AM Views : 488

Studio18 News - క్రీడలు / : ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా పరాజయంతో ప్రారంభించిన విష‌యం తెలిసిందే. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 800కు పైగా పరుగులు సాధించి, ఏకంగా ఐదు సెంచరీలు నమోదు చేసినప్పటికీ భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ వైఫల్యంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఆయన కోచింగ్‌లో జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించాడు. "టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్ గంభీర్‌పై ప్రస్తుతం చాలా ఒత్తిడి ఉంది. అది రోజురోజుకూ పెరుగుతోంది. ఆయన మార్గదర్శకత్వంలో భారత్ ఆడిన చివరి తొమ్మిది టెస్టుల్లో కేవలం రెండింటిలోనే గెలిచింది. ఏకంగా ఏడు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది" అని విశ్లేషించాడు. గంభీర్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌పై రెండు, ఆస్ట్రేలియాపై ఒక టెస్టు గెలిచిన జట్టు.. న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియాతో మూడు, తాజాగా ఇంగ్లాండ్‌తో ఒక మ్యాచ్‌లో ఓడిపోయిందని ఆయన గుర్తుచేశాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లో జట్టు ప్రదర్శన మెరుగుపడకపోతే గంభీర్ తన ప్రధాన కోచ్ పదవిని కోల్పోయే ప్రమాదం కూడా ఉందని ఆకాశ్ చోప్రా హెచ్చరించాడు. "ఈ పర్యటనలో టీమిండియాకు అనుకూల ఫలితాలు రాకపోతే గౌతమ్ గంభీర్ తన పదవిని కోల్పోవచ్చు. ఎందుకంటే జట్టు యాజమాన్యం కోరిన ఆటగాళ్లనే సెలక్టర్లు ఎంపిక చేశారు. అడిగిన ప్లేయర్స్‌ను జట్టులోకి తీసుకున్న తర్వాత కూడా ఫలితాలు రాకపోతే ఇబ్బందులు తప్పవు" అని ఆయన స్పష్టం చేశాడు. దీంతో ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలు గంభీర్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :