Monday, 16 March 2026 01:53:14 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

Vaibhav Suryavanshi: కొనసాగుతున్న సంచలనాల మోత... పంత్ రికార్డు బద్దలుకొట్టిన వైభవ్

Date : 06 January 2026 07:33 PM Views : 193

Studio18 News - క్రీడలు / : యూత్‌ వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రిషభ్ పంత్ రికార్డు బ్రేక్ 24 బంతుల్లో 10 సిక్సర్లతో 68 పరుగులు చేసిన 14 ఏళ్ల వైభవ్ దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుపై భారత్ ఘన విజయం భారత క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలనాలు కొనసాగుతున్నాయి. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తాజాగా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డేలో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. నిన్న‌ బెనోనిలో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డేలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వైభవ్, ఆరంభం నుంచే విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తం 24 బంతులు ఎదుర్కొని 10 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు చేశాడు. అతని స్కోరులో 64 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం. గతంలో రిషభ్ పంత్ 18 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా, వైభవ్ దానిని అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా భారత్‌కు 27 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్, దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను ఔటైన తర్వాత వేదాంత్ త్రివేది (31 నాటౌట్), అభిగ్యాన్ కుందు (48 నాటౌట్) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :