Tuesday, 10 March 2026 04:07:39 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

చరిత్ర తిరగరాసిన భారత్ జట్టు..

Date : 09 March 2026 09:28 AM Views : 38

Studio18 News - క్రీడలు / HYDERABAD : టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి టీ20 ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విజయంతో భారత్ అత్యధిక టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన జట్టుగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించడం ద్వారా ఈ అరుదైన ఘనతను అందుకుంది. టీమిండియా ఇప్పటివరకు మూడు టీ20 ప్రపంచకప్‌లు గెలుచుకుంది. 2007, 2024, 2026 సంవత్సరాల్లో ట్రోఫీని అందుకుని పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వరల్డ్‌కప్ టైటిళ్లు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా కప్ గెలిచి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అనంతరం చాలా సంవత్సరాల పాటు కప్ కలగానే మిగిలింది. రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో మరోసారి భారత్ టీ20 ట్రోఫీని సొంతం చేసుకుంది. తాజాగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2026లో మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని భారత జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు రెండేసి సార్లు టైటిళ్లు గెలుచుకున్నాయి. ఇంగ్లాండ్ 2010, 2022 సంవత్సరాల్లో ట్రోఫీని అందుకోగా, వెస్టిండీస్ 2012, 2016లో విజేతగా నిలిచింది. పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఒక్కోసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి. పాకిస్థాన్ 2009లో విజేతగా నిలిచింది. శ్రీలంక 2014లో ట్రోఫీని అందుకోగా, ఆస్ట్రేలియా 2021లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా భారత్ నిలిచి తన సత్తాను ప్రపంచానికి చాటిం

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :