Monday, 16 March 2026 01:53:14 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

Yuvraj Singh: పీటర్సన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి భయానక అనుభవాలను గుర్తు చేసుకున్న యువరాజ్ సింగ్

Date : 06 January 2026 07:28 PM Views : 166

Studio18 News - క్రీడలు / : క్యాన్సర్‌ను జయించిన విజేత యువరాజ్ సింగ్ 3 నుంచి 6 నెలలే బతుకుతావని డాక్టర్లు చెప్పారన్న యువీ 2011 వరల్డ్ కప్ గెలుపులో కీలకపాత్ర పోషించిన యువరాజ్ సింగ్ టీమ్ ఇండియా లెజెండ్ యువరాజ్ సింగ్ క్యాన్సర్‌తో పోరాడి జయించిన కథ అందరికీ తెలిసిందే. 2011 వరల్డ్ కప్‌లో క్యాన్సర్ బాధలతోనే ఆడి, జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ యూట్యూబ్ ఛానల్ The Switch కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ తన ఆ రోజుల భయానక అనుభవాలను మళ్లీ గుర్తు చేసుకున్నాడు. యువరాజ్ మాట్లాడుతూ... "డాక్టర్లు నాకు 3 నుంచి 6 నెలలే బతుకుతానని చెప్పారు. ట్యూమర్ నా ఊపిరితిత్తి, గుండె మధ్యలో ఉంది. కీమోథెరపీ చేయకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు" అని తెలిపాడు. "నేను దాదాపు 7 సంవత్సరాలు వేచి చూశాను. 40 టెస్టులకు 12వ ఆటగాడిగా ఉన్న తర్వాత టెస్ట్ క్రికెట్‌లో స్థానం సుస్థిరం చేసుకోవాలనుకున్నా. కానీ చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. నా ముందు మార్గం లేకపోయింది" అని యువీ వివరించాడు. యూవీ 2011-2012లో అమెరికాలో కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆ రోజుల్లో డాక్టర్ లారెన్స్ ఐన్‌హార్న్ మాటలు తనకు బలం ఇచ్చాయని యువీ చెప్పాడు. "నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి వెళతావని డాక్టర్ చెప్పారు. ఆ మాటలు నాకు ధైర్యం ఇచ్చాయి. క్యాన్సర్ నుంచి కోలుకుని మళ్లీ క్రికెట్ ఆడగలనని చెప్పినప్పుడు అది పునర్జన్మలా అనిపించింది" అని ఎమోషనల్ అయ్యాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత యువరాజ్ మైదానంలో అద్భుతాలు చేశాడు. 2013లో ఆస్ట్రేలియాతో టీ20లో 35 బంతుల్లోనే 77 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడ, 2017లో ఇంగ్లండ్‌పై కటక్‌లో వన్డేలో తన అత్యధిక స్కోర్ 150 పరుగులు చేశాడు. అదే ఏడాది వెస్టిండీస్ టూర్‌లో చివరిసారి ఆడాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యాడు. ఈ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువరాజ్ పోరాటం ఎంతమందికో ఇన్‌స్పిరేషన్!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :