Studio18 News - క్రీడలు / : దులీప్ ట్రోఫీ 2024 టోర్నీలో ఇండియా 'సీ' జట్టులో స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఇండియా టీ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ స్పిన్నర్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ మేరకు తన సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 19.1 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు ఏడు మెయిడిన్ ఓవర్లు చేశాడు. 233 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ‘సీ’ టీమ్ చేధించింది. మానవ్ సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 'డీ' టీమ్ 233 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 'డీ' 164 పరుగులు, ఇండియా సీ టీమ్ 168 పరుగులు చేశాయి. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో విజయానికి అవసరమైన 233 పరుగుల సాధించడంతో ఇండియా సీ టీమ్ గెలుపొందింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ సుతార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Admin
Studio18 News