Tuesday, 10 March 2026 02:44:36 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళంపై ఏఐఎఫ్ఎఫ్ ప్రకటన

Date : 13 December 2025 06:27 PM Views : 256

Studio18 News - క్రీడలు / : కోల్‌కతా మెస్సీ ఈవెంట్‌తో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన ఏఐఎఫ్ఎఫ్ ఇది ఓ ప్రైవేట్ పీఆర్ ఏజెన్సీ నిర్వహించిన కార్యక్రమమని వెల్లడి తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ప్రకటన ఘటనపై విచారణకు జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు చేసిన బెంగాల్ సీఎం కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొన్న కార్యక్రమంలో జరిగిన గందరగోళం, నిర్వాహణ లోపాలపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించిన కార్యక్రమమని, దీని గురించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తేల్చిచెప్పింది. "వివేకానంద యువ భారతి క్రీడాంగణంలో జరిగిన పరిణామాలపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ఇది ఒక ప్రైవేట్ పీఆర్ ఏజెన్సీ నిర్వహించిన కార్యక్రమం. దీని ప్రణాళిక, నిర్వహణ లేదా అమలులో ఏఐఎఫ్ఎఫ్‌కు ఎలాంటి పాత్ర లేదు. ఈ కార్యక్రమ వివరాలను మాకు తెలియజేయలేదు, మా నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు" అని ఏఐఎఫ్ఎఫ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మెస్సీ తన 'గోట్ టూర్'లో భాగంగా సహచర అర్జెంటీనా ఆటగాడు రోడ్రిగో డి పాల్‌, ఉరుగ్వే సాకర్ స్టార్ లూయిస్ సువారెజ్ తో కలిసి కోల్‌కతా వచ్చాడు. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు వేలాది మంది అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియానికి తరలివచ్చారు. అయితే, అధిక టికెట్ ధరలు, మెస్సీని చూసేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానుల ఉత్సాహం నిరాశగా మారింది. ఇది కాస్తా తీవ్ర గందరగోళానికి, విధ్వంసానికి దారితీసింది. ఈ పరిణామాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ ఘటనకు దారితీసిన నిర్వాహణ లోపాలపై విచారణ జరిపేందుకు కలకత్తా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ ఘటనతో అంతర్జాతీయ స్టార్లతో కూడిన కార్యక్రమాలకు భద్రత,

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :