Thursday, 12 March 2026 12:50:28 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Shimron Hetmyer: టీ20 వరల్డ్ కప్: రాణించిన హెట్మెయర్... విండీస్ 20 ఓవర్లలో 182-5

Date : 07 February 2026 06:41 PM Views : 124

Studio18 News - క్రీడలు / : టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసిన వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ షిమ్రోన్ హెట్మెయర్ (64) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఫలితంగా స్కాట్లాండ్ ముందు 183 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (35), షాయ్ హోప్ (19) ఓ మోస్తరు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే, ఆ తర్వాత షిమ్రోన్ హెట్మెయర్ స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 36 బంతుల్లో 2 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 64 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి రోవ్‌మన్ పావెల్ (24), షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (26) కూడా వేగంగా ఆడి తమ వంతు సహకారం అందించారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ కర్రీ అద్భుతంగా బౌలింగ్ చేసి, 4 ఓవర్లలో కేవలం 23 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. సఫ్యాన్ షరీఫ్, మైఖేల్ లీస్క్, డేవిడ్‌సన్ తలో వికెట్ తీశారు. అనంతరం 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. తాజా సమాచారం అందేసరికి స్కాట్లాండ్ 2.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 19 పరుగులతో ఆడుతోంది. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో మైఖేల్ జోన్స్ (1) ఔటయ్యాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :