Thursday, 12 March 2026 12:21:39 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

Date : 09 February 2026 06:47 PM Views : 111

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రభాస్ 'స్పిరిట్' నుంచి ప్రకాశ్‌ రాజ్‌ను తప్పించారంటూ ప్రచారం సోషల్ మీడియా వార్తలను ఖండించిన సీనియర్ నటుడు తన షూటింగ్ ఇంకా మొదలే కాలేదని స్పష్టీకరణ ఇవి విషపూరిత ఫేక్ న్యూస్ అంటూ 'ఎక్స్‌'లో పోస్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా నుంచి సీనియర్ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ను తొలగించారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇదంతా విషపూరితమైన ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. ఈ విషయంపై ప్రకాశ్‌ రాజ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "స్పిరిట్ సినిమాపై విషపూరితమైన ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న పెడ్లర్స్‌ అందరికీ చెబుతున్నా.. ఈ సినిమాలో నా సన్నివేశాల షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ, మీరు వాట్సాప్ ఫ్యాక్టరీలో ఊహాజనిత కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా నిద్ర లేచి ఎవరి జీవితాన్ని వాళ్లు గడపండి" అని ఘాటుగా స్పందించారు. దీనికి నవ్వుతున్న ఎమోజీలను, '#JustAsking' అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. దీంతో ఈ వదంతులకు పూర్తిస్థాయిలో చెక్ పడినట్లయింది. ఇక‌, ఇటీవలే 'స్పిరిట్' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాశ్‌ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :