Sunday, 08 February 2026 10:55:24 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

లవ్ స్టోరీస్ జోరు తగ్గినట్టేనా

ఒకప్పుడు ప్రేమకథలదే పైచేయి నిదానంగా తగ్గుతూ వస్తున్న లవ్ స్టోరీస్ మరింత దూరమవుతున్న టీనేజ్ ప్రేమకథలు యూత్ ను నిరాశపరిచే విషయమే ఇది

Date : 11 November 2024 12:24 PM Views : 254

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : వెండితెరపై నిన్నమొన్నటి వరకూ ప్రేమకథలు రాజ్యమేలాయి. చాలామంది హీరోలు ప్రేమకథలతోనే తెరకి పరిచయమయ్యారు. సినిమాలు చూసేవారిలో యూత్ ఎక్కువ. వాళ్లకి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీస్ చేస్తే, మినిమమ్ వసూళ్లు ఎక్కడికీ పోవు అనే ఒక నమ్మకం మేకర్స్ కి ఉండేది. ఇక లవర్ బాయ్ అనే ఇమేజ్ సంపాదించుకున్న హీరోలు, చాలా కాలం పాటు అదే ట్రాక్ లో తమ ప్రయాణాన్ని కొనసాగించేవారు. ప్రేమ .. గీతాంజలి .. అభినందన .. వంటి ప్రేమకథలు ఇప్పుడు రావడం లేదు. ఒకవేళ అలాంటి కథలను తీయాలనుకున్నా, అందుకు తగిన హీరోలు .. హీరోయిన్స్ లేని ఒక చిత్రమైన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇప్పటి కథల్లోను ప్రేమ ఉంది .. కానీ ప్రేమ చుట్టూ తిరిగే కథ కనిపించక చాలా కాలమే అయింది. శ్రీకాంత్ తనయుడు ఎంట్రీ ఇచ్చాక, ఒక మంచి టీనేజ్ లవర్ దొరికాడని అంతా అనుకున్నారు. కానీ అంతలోనే అతను చదువు కోసం గ్యాప్ తీసుకున్నాడు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే, 'బుట్టబొమ్మ'తో పరిచయమైన అనిక సురేంద్రన్ ను చూసి, లవ్ స్టోరీస్ కి ఒక మంచి బ్యూటీ దొరికింది అనిపించింది. కానీ ఎందుకో ఈ అమ్మాయి తమిళ సినిమాలపైనే ఫోకస్ చేస్తోంది. ఆ మధ్య వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో ఐశ్వర్య రాయ్ పాత్రకు టీనేజ్ అమ్మాయిగా కనిపించిన 'సారా అర్జున్' కూడా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తరువాత మళ్లీ కనిపించలేదు. థ్రిల్లర్ జోనర్ ను దాటుకుని లవ్ స్టోరీస్ ముందుకు వెళ్లడం కష్టంగానే ఉంది. ఇక అలాంటి కంటెంట్ కి హీరో హీరోయిన్స్ ను వెతికి పట్టుకోవడం మరింత కష్టంగా ఉండటమే విచారకరం.

Also Read : దర్శకుడు రాంగోపాల్ వర్మపై మద్దిపాడులో కేసు నమోదు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :