Sunday, 08 March 2026 09:56:04 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్!

క్రితం శుక్రవారం విడుదలైన 'కోర్ట్' తొలిరోజునే దక్కిన హిట్ టాక్ ముందుగా నానీకే కథ వినిపించానన్న దర్శకుడు ఆయన కోసం వెయిట్ చేయడానికి అదే కారణమని వ్యాఖ్య

Date : 17 March 2025 05:00 PM Views : 200

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'కోర్ట్' సినిమా హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి దర్శకుడు రామ్ జగదీశ్ వైపుకు మళ్లింది. తాజాగా ఆయన 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమా గురించిన విషయాలను పంచుకున్నాడు. "ఈ కథపై రీసెర్చ్ కి, రైటింగ్ కి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది. ఈ కథలో హీరోగా ప్రియదర్శిని అనుకున్నాను. ఆయనే నానీని కలవమని చెప్పారు. నాని అపాయింట్మెంట్ కోసం 8 నెలలు వెయిట్ చేశాను" అని అన్నారు. "ఈ సినిమాను కథగా చెబితే పెద్ద ఎఫెక్టివ్ గా అనిపించదు. తెరపై చూస్తే ఎలా ఉంటుందనేది జడ్జ్ చేయగల నిర్మాత కావాలని అనిపించింది. అందువలన నానీగారికి వినిపించడమే బెటర్ అనే ఉద్దేశంతో కలవడం జరిగింది. నానిగారికి ముందు ఏ నిర్మాత దగ్గరికి వెళ్లలేదు. స్క్రిప్ట్ విన్న నానిగారు ఎలాంటి మార్పులు చేయమని అడగలేదు. ఆయనకి వినిపించిన కథను యధాతథంగా తెరపైకి తీసుకొచ్చాను" అని అన్నారు. "కోర్టుకు సంబంధించిన ఒక అంశాన్ని రియల్ లైఫ్ లో నుంచి తీసుకోవడం జరిగింది. అందువలన మరింత సహజంగా అనిపించడమే కాకుండా, ఆడియన్స్ లో ఆసక్తి పెరగడానికి కారణమైంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఆడియన్స్ గెస్ చేయలేకపోయారు. స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా కుదరడం వలన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను నేను ఎంజాయ్ చేస్తున్నాను" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :