Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : FNCC : ఇటీవల ఏపీలో వచ్చిన వరదలతో ప్రజలు ఎంతగానో నష్టపోయారు. విజయవాడ, చుట్టు పక్కల కొన్ని ప్రాంతాలు వరదలో మునిగి భారీ నష్టం నెలకొంది. ఇప్పటికే వరద బాధితుల కోసం టాలీవుడ్ నుంచి అనేక మంది సినీ ప్రముఖులు, సినీ యూనియన్లు భారీ విరాళం ఇచ్చారు. తాజాగా వరద భాదితుల కోసం ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్(FNCC క్లబ్) భారీ విరాళం అందించారు. తాజాగా సీఎం చంద్రబాబుని FNCC క్లబ్ తరపున ప్రెసిడెంట్ జి.ఆదిశేషగిరిరావు, సెక్రెటరీ మోహన్ ముళ్ళపూడి, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు.. పలువురు సభ్యులు కలిసి 25 లక్షల రూపాయల చెక్కుని వరద బాధితుల సహాయార్థం అందించారు. ఈ క్రమంలో చంద్రబాబు FNCC మెంబర్స్ ని అభినందించారు. ఈ సందర్భంగా FNCC మెంబర్స్ మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణలో ఎలాంటి విపత్తు వచ్చినా FNCC తరఫున గతంలో సహాయం చేసాం. ఇప్పుడు,ఎప్పుడు చేయడానికి ముందుంటాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి 25 లక్షలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి 25 లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది అని తెలిపారు.
Admin
Studio18 News