Sunday, 25 January 2026 04:50:07 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

సినీ అవార్డులు... ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు మురళీమోహన్ కీలక విన్నపం

Date : 30 May 2025 02:41 PM Views : 300

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సినిమా అవార్డులను ప్రకటించాలని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డుల ప్రకటన కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చే విషయంలో ఒక అవగాహనకు రావాలని, వివాదాలకు తావివ్వకుండా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ఒకే తెలుగు సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అవార్డులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. "ఇలా చేయడం వల్ల అనవసరమైన చర్చలకు, వివాదాలకు దారితీస్తుంది. దీనికి బదులుగా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నిర్ణయానికి రావాలి. ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే, మరుసటి ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించాలి. ఈ పద్ధతి పాటించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు" అని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ... ‘‘తెలంగాణలో ఈ సినిమాకు, ఆంధ్రాలో ఆ సినిమాకు అవార్డు ఇచ్చారనేది వివాదానికి దారితీస్తుంది. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటే. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతున్నాయి. తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్లు చూస్తున్నారు’’ అని వివరించారు. తెలుగు సినిమా పరిశ్రమ, ప్రేక్షకుల ఐక్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. మురళీమోహన్ సూచనపై ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :