Saturday, 07 March 2026 08:52:49 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

నాగచైతన్య కెరీర్‌లో యాడ్‌ అవుతున్న మరో కొత్త జానర్‌ సినిమా!

కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగచైతన్య మిథికల్‌ థ్రిల్లర్‌గా నాగచైతన్య కొత్త సినిమా డిసెంబర్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభం నాగచైతన్య బర్త్‌డే సం

Date : 23 November 2024 01:19 PM Views : 309

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఇప్పటి వరకు తన కెరీర్‌లో చేయని ఓ కొత్త జానర్‌లో నాగచైతన్య ఓ నూతన చిత్రాన్ని అంగీకరించాడు. ఇంతకు ముందు సాయి దుర్గ తేజ్‌, సంయుక్త మీనన్‌లతో 'విరూపాక్ష' లాంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన కార్తీక్‌ దండు ఈ చిత్రానికి దర్శకుడు. 'మిథికల్‌ థ్రిల్లర్‌'గా రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థతో కలిపి నిర్మిస్తోంది. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి సుకుమార్‌ కూడా మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబరులో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. కాగా శనివారం కథానాయకుడు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ పోస్టర్‌లో ఓ పవర్‌ఫుల్‌ నేత్రంలో రాక్ క్లైంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య కనిపించారు. ఇది ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తుంది. నాగచైతన్య కెరీర్‌లో 24వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి ఎన్‌సీ 24 అనే వర్కింగ్‌ టైటిల్‌ను నిర్ణయించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకోనున్న ఈ చిత్రంలో సిజీ వర్క్‌ గ్రాండ్‌గా ఉండబోతుందని, ఇందుకోసం ఉన్నతమైన సాంకేతిక నిపుణులను ఉపయోగిస్తున్నామని మేకర్స్‌ చెబుతున్నారు. విజువల్‌గా ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందని అంటున్నారు చిత్ర యూనిట్‌ సభ్యులు. శ్యామ్‌ దత్‌ ఫోటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి కాంతార, విరూపాక్ష చిత్రాలతో అందరి మెప్పు పొందిన అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీ నాగేంద్ర కళా దర్శకుడు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారు.

Also Read : మహారాష్ట్ర ఫలితాలను సరిగ్గా అంచనా వేసిన 'కేకే సర్వే'!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :