Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ సిరీస్ పేరే 'పారాచూట్'. తమిళ నటుడు కృష్ణ ఈ సిరీస్ లో నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో, కన్నడ కిశోర్ .. కని తిరు .. శక్తి రిత్విక్ - ఇయల్ అనే పిల్లలు ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సిరీస్ ను ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ట్రైలర్ వదిలిన దగ్గర నుంచి ఈ సిరీస్ పై ఒక్కసారిగా ఆసక్తి పెరగడం మొదలైంది. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ సిరీస్, తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ .. మరాఠీ .. బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : ఈ వెబ్ సైట్లను ఎంత మంది చూస్తారో తెలుసా?
Admin
Studio18 News