Wednesday, 25 June 2025 07:27:52 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్!

Date : 22 May 2025 12:37 PM Views : 99

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో తన తదుపరి చిత్రం గురించి ఒక్క మాటతో అంచనాలు పెంచేశారు. సుకుమార్ తన స్వగ్రామమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం మట్టపర్రుకు కుటుంబ సమేతంగా విచ్చేశారు. గ్రామస్తులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా సుకుమార్ ఓ మీడియాతో మాట్లాడుతూ హీరో రామ్ చరణ్‌తో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేసినట్లు తెలిపారు. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభించేది త్వరలో వెల్లడిస్తానన్నారు. తమ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' చిత్రం అప్పట్లో ఇండస్ట్రీలో హిట్‌గా నిలిచిందన్నారు. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్'తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారని అన్నారు. ఆయనతో తాను తీయబోయే సినిమా ఆ స్థాయిలోనే ఉంటుందని పేర్కొన్నారు. సుకుమార్ మాటలతో రామ్ చరణ్ తదుపరి చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందన్న అంచనాతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో తీసిన 'పుష్ప' ద్వారా తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, దానికి వచ్చిన స్పందన చూసి రెండో భాగాన్ని మరింత శ్రద్ధతో తీశామని సుకుమార్ పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :