Sunday, 08 February 2026 01:58:27 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Pawan Kalyan: పవన్ బర్త్ డే స్పెషల్... 'ఓజీ' నుంచి అదిరిపోయే గ్లింప్స్... వీడియో ఇదిగో!

Date : 02 September 2025 07:22 PM Views : 317

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పవన్ కల్యాణ్ పుట్టినరోజున 'ఓజీ' నుంచి అదిరిపోయే అప్‌డేట్ కొత్త గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన చిత్ర బృందం పవన్ ఫ్యాన్స్‌లో అంబరాన్నంటిన సంబరాలు సెప్టెంబర్ 25న సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు 'ఓజీ' చిత్ర బృందం అదిరిపోయే కానుకను అందించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ గ్లింప్స్, సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించారు. విజువల్స్, నేపథ్య సంగీతం సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో తెలియజేస్తున్నాయి. అభిమానుల నుంచి ఈ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :