Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్, రైటర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. దీనిపై సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. ఆర్యన్ ఖాన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె ప్రశంసించారు. అందరు స్టార్ కిడ్స్ మాదిరి నటనలోకి అడుగుపెట్టకుండా... కెమెరా వెనుక నిలబడి మెగాఫోన్ పట్టుకోవడం ప్రశంసించదగ్గ విషయమని చెప్పారు. స్టార్ కిడ్స్ బరువు తగ్గడం, తమను తాము బొమ్మల్లా భావించడం, నటీనటులుగా మారడం సాధారణంగా జరిగే విషయమేనని కంగన అన్నారు. అయితే అంతకు మించి వెళ్లాలనుకోవడం చాలా గొప్ప విషయమని చెప్పారు. స్టార్ కుటుంబాలకు చెందిన పిల్లలు కష్టపడకుండా సులభమైన మార్గాన్ని ఎంచుకుని నటనలోకి వస్తుంటారని చెప్పారు. అలాకాకుండా డైరెక్షన్ వైపు ఆర్యన్ వెళ్లాలనుకోవడం గ్రేట్ అని అన్నారు. రైటర్, దర్శకుడిగా ఆర్యన్ తొలి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.
Also Read : సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరుకాని కాంగ్రెస్ ఎమ్మెల్యే
Admin
Studio18 News