Sunday, 25 January 2026 05:13:20 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Bhadrakaali: విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

అరుణ్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా భద్రకాళి సొంత బ్యానర్ పై భద్రకాళి చిత్రాన్ని నిర్మిస్తున్న విజయ్ ఆంటోనీ ఈ వేసవిలో విడుదల టీజర్ తో పెరిగి

Date : 13 March 2025 01:15 PM Views : 247

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : హీరోగా, నిర్మాతగా, లిరిసిస్ట్ గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్‌గా ఇలా అన్ని రకాలుగా సత్తా చాటుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 25వ చిత్రం ‘భద్రకాళి’తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా భద్రకాళి సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. "పిల్లి కూడా ఒక రోజు పులి అవును... అబద్ధం, అహంకారం అంతం అవును"... అంటూ ప్రారంభమైన ఈ టీజర్‌ ను చూస్తే... ఈ సినిమాలో విజయ్ ఆంటోని అసలు ఏ పాత్రను పోషిస్తున్నాడన్నది సస్పెన్స్ కలిగిస్తుంది. ఒకసారి ఫ్యామిలీ మేన్‌లా, మరోసారి గ్యాంగ్ స్టర్‌లా అనిపిస్తున్నారు.. ఇంకో సందర్భంలో ఉన్నతాధికారిలా కనిపిస్తున్నారు... అసలు ఈ కిట్టు ఎవరు? అనే ఆసక్తిని రేకెత్తించేలా భద్రకాళి టీజర్‌ను కట్ చేశారు. 190 కోట్ల కుంభకోణం పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందని అర్థమవుతోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ చివర్లో వచ్చిన డైలాగ్‌తో టీజర్ మీద మరింత ఆసక్తిని పెంచేసినట్టు అయింది. విజయ్ ఆంటోని ఈ చిత్రంలో ఇది వరకు ఎన్నడూ కనిపించినంత స్టైలిష్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ షెల్లీ కాలిస్ట్ విజువల్స్ ఈ టీజర్‌లో అద్భుతంగా అనిపిస్తున్నాయి. విజయ్ ఆంటోనీ ఆర్ఆర్, రేమండ్ డెరిక్ క్రాస్టా ఎడిటింగ్, రాజశేఖర్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ టీజర్‌లో హైలెట్ అవుతున్నాయి. ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ భద్రకాళి సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :