Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Shah Rukh Khan : సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలని వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటారు. ఇంటర్వ్యూలలో మన హీరోలు, హీరోయిన్స్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడమే లేదా వాళ్ళ గురించి వాళ్లకు క్లోజ్ అయిన వాళ్ళు చెప్పడమో చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ రాయి షారుఖ్ ఖాన్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షారుఖ్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలిపాడు. ఆనంద్ రాయ్ షారుఖ్ తో జీరో అనే సినిమా తీసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కానీ షారుఖ్ తో మాత్రం మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ రాయ్ మాట్లాడుతూ.. షారుక్ ఖాన్‌కు తందూరీ చికెన్ అంటే చాలా ఇష్టం. అలాగే కాఫీ, కూల్ డ్రింక్స్ కూడా బాగా ఇష్టం. చికెన్, కాఫీ, కూల్ డ్రింక్స్ ఉంటే షారుఖ్ కి భోజనం లేకపోయినా పర్వాలేదు అంటాడు. కానీ ప్రేమతో మనమేదైనా స్పెషల్ గా ఇస్తే తింటాడు అని తెలిపారు.
Admin
Studio18 News