Saturday, 24 January 2026 01:34:02 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Janhvi Kapoor: 'ది గర్ల్‌ఫ్రెండ్' తప్పకుండా చూడాల్సిన సినిమా.. రష్మికను మెచ్చుకున్న జాన్వీ కపూర్

Date : 08 December 2025 08:07 PM Views : 254

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాన్ని మెచ్చుకున్న జాన్వీ కపూర్ రష్మిక నటనకు ఫిదా అయిన జాన్వీ.. ఇన్‌స్టాలో ప్రత్యేక పోస్ట్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో 'పెద్ది' సినిమాలో నటిస్తున్న జాన్వీ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'‌ను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలని ఆమె సూచించారు. ఈ మేరకు జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాలోని ఓ కీలక సన్నివేశాన్ని షేర్ చేశారు. దీనికి "#TheGirlfriend. Mandatory Watch" (తప్పకుండా చూడాలి) అని క్యాప్షన్ జోడించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామాలో రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' అనే భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె 'అచ్చియమ్మ' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల మైసూర్‌లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఏకంగా 1000 మంది డ్యాన్సర్లతో ఓ భారీ పాటను చిత్రీకరించారు. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా 2026 మార్చి 27న 'పెద్ది' చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :