Sunday, 08 March 2026 10:52:36 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

ARI Movie | పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తున్న అరి

ARI Movie | ‘పేపర్ బాయ్’ లాంటి సున్నితమైన ప్రేమ కథతో అందరినీ మెప్పించిన దర్శకుడు ‘అరి’ అంటూ ఈ వారం ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. నిన్న (అక్టోబర్ 10) విడు

Date : 11 October 2025 07:35 PM Views : 227

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ARI Movie | ‘పేపర్ బాయ్’ లాంటి సున్నితమైన ప్రేమ కథతో అందరినీ మెప్పించిన దర్శకుడు ‘అరి’ అంటూ ఈ వారం ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. నిన్న (అక్టోబర్ 10) విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఆడియెన్స్ నుంచి మౌత్ టాక్ ఇలా అన్నీ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఈ వారం వచ్చిన చిత్రాలన్నింట్లోనూ అరి కాస్త ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు. అరికి మంచి ప్రశంసలు లభించడం, ఆదరణ దక్కుతుండటంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక ‘అరి’ సక్సెస్ సాధించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం దర్శకుడు జయశంకర్‌ను అభినందించారు. ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని కొనియాడారు. అరి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం అరి చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్ని ఆకట్టుకుంటోంది. ఇక అరి చిత్రంలోని కథ, కథనం, ఇచ్చిన సందేశం ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. ‘అరి’ చిత్రానికి అనూప్ రూబెన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్స్ పరంగానూ మంచి పేరు వచ్చింది. మొత్తానికి అరితో దర్శకుడు జయశంకర్ ద్వితీయ విఘ్నం దాటినట్టుగా చెప్పుకోవచ్చు. అరి సినిమాలోని మాటలు, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఓ ట్రాన్స్ లో డైరెక్టర్ జయశంకర్ సీన్ టు సీన్ తీసుకుంటూ వెళ్ళిపోయారని చూసిన ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంలో వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలకు అందరూ కనెక్ట్ అవుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :