Monday, 08 December 2025 04:36:56 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Tom Cruise: తొమ్మిది నెలల రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పేసుకున్న టామ్ క్రూజ్, అనా డి అర్మాస్

Date : 18 October 2025 07:21 PM Views : 133

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్, నటి అనా డి అర్మాస్ బ్రేకప్ వీరి పెళ్లి అంతరిక్షంలో జరగనుందంటూ ఇటీవలే వార్తలు స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్న జంట హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ (63), అందాల నటి అనా డి అర్మాస్ (37) తమ ప్రేమ బంధానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది. గత 9 నెలలుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవలే వార్తలు హోరెత్తాయి. వీరి వివాహం ఏకంగా అంతరిక్షంలో అంగరంగ వైభవంగా జరగనుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలు మరువక ముందే, వీరిద్దరూ విడిపోయారంటూ హాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, టామ్ క్రూజ్, అనా డి అర్మాస్ తమ ప్రేమ ప్రయాణంలో ఎన్నో మధుర క్షణాలను పంచుకున్నారు. అయితే, ఈ బంధాన్ని మరో మెట్టు ఎక్కించే విషయంలో ఇద్దరి మధ్య ఆసక్తి సన్నగిల్లినట్లు సమాచారం. ఈ సంబంధం భవిష్యత్తులో ఎక్కువ కాలం నిలవదని భావించిన ఇద్దరూ, స్నేహపూర్వకంగా విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా విడిపోయినప్పటికీ, వృత్తిపరంగా తమ ప్రయాణాన్ని కొనసాగించాలని ఈ జంట నిర్ణయించుకుంది. బ్రేకప్ తర్వాత కూడా రాబోయే సినిమాల్లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే టామ్ క్రూజ్ తదుపరి చిత్రంలో అనా డి అర్మాస్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు హాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో వీరి బ్రేకప్ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :