Thursday, 12 March 2026 01:07:35 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Dhanush: ధనుష్ మేనేజర్ శ్రేయాస్‌పై నటి మాన్య కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

Date : 19 November 2025 08:00 PM Views : 255

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సినిమా అవకాశం కోసం "కమిట్‌మెంట్" ఇవ్వాలని అడిగాడని వెల్లడి ధనుష్ పేరు చెప్పి కూడా ఒత్తిడి చేశారని ఆరోపణ ఇండస్ట్రీలో ఈ పద్ధతికి ముగింపు పలకాలని ఆవేదన ఆరోపణలపై ఇంకా స్పందించని ధనుష్ బృందం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి ఆయన మేనేజర్ శ్రేయాస్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ తమిళ టీవీ నటి మాన్య ఆనంద్, శ్రేయాస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఓ కొత్త సినిమా అవకాశం కోసం ఆయన తనను "కమిట్‌మెంట్" అడిగాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. మాన్య తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ధనుష్ మేనేజర్ శ్రేయాస్ ఓ కొత్త సినిమా కోసం నన్ను సంప్రదించారు. సినిమాకు కమిట్‌మెంట్ ఇవ్వాలని అడిగారు. ఎలాంటి కమిట్‌మెంట్ అని నేను ప్రశ్నించాను. సినిమా కోసం అలాంటి షరతులు అంగీకరించేందుకు నేను సిద్ధంగా లేనని చెప్పాను. అప్పుడు అతను, 'ధనుష్ సర్ అయినా ఒప్పుకోరా?' అని అడిగాడు" అని వివరించారు. మాన్య ఆరోపిస్తూ, తాను తిరస్కరించినా శ్రేయాస్ చాలాసార్లు ఫోన్ చేసి, ధనుష్ నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్స్ లొకేషన్‌కు పంపాడని, స్క్రిప్ట్ చదవాలని ఒత్తిడి చేశాడని చెప్పారు. "మేము నటులం, నటించడం మా పని. అవకాశాలు ఇవ్వండి కానీ ప్రతిఫలంగా ఏమీ ఆశించవద్దు. ఇండస్ట్రీలో ఈ పద్ధతికి ముగింపు పలకాలి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సినిమా కోసం మరో మేనేజర్ కూడా తనను ఇలాగే సంప్రదించాడని ఆమె వెల్లడించారు. 'వనతై పోలా' అనే తమిళ టీవీ సీరియల్‌తో మాన్య ఆనంద్ బాగా ప్రాచుర్యం పొందారు. ప్రస్తుతం ఆమె చేసిన ఆరోపణలతో కూడిన ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ధనుష్ బృందం గానీ, మేనేజర్ శ్రేయాస్ గానీ స్పందించలేదు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :