Sunday, 15 March 2026 09:48:54 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Rahul Sipligunj: నేను చేసిన ఆ తప్పుకి ఇప్పటికీ బాధపడుతుంటా: రాహుల్ సిప్లిగంజ్

Date : 19 October 2024 01:27 PM Views : 272

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటతో ఎంతో మంది అభిమానులను రాహుల్ సిప్లిగంజ్ సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ ఫేమ్ గా కూడా ఆయనకు చాలా క్రేజ్ ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ... తాను చేసిన ఒక తప్పును బయటపెట్టారు. తాను రజనీకాంత్ కు వీరాభిమానినని రాహుల్ తెలిపారు. 'అన్నాత్తే' సినిమా షూటింగ్ సమయంలో ఆయనను కలిసే అవకాశం తనకు దక్కిందని... తన ఇష్టాన్ని గుర్తించి, ఆ మూవీ లుక్ లోనే ఆయన తనతో ఫొటో దిగారని చెప్పారు. ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ ను ఇంకా రిలీజ్ చేయలేదని, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఫొటోను షేర్ చేయవద్దని రజనీకాంత్ తనకు చెప్పారని తెలిపారు. అయితే, కొన్ని రోజుల తర్వాత తాను ఆ ఫొటోను షేర్ చేశానని... ఆ పిక్ వైరల్ అయిందని చెప్పారు. తన జీవితంలో తాను చేసిన తప్పు అదేనని... అలా చేసినందుకు తాను ఇప్పటికీ బాధ పడుతుంటానని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :