Thursday, 12 March 2026 03:34:55 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Harsha Sai : పరారీలో యూట్యూబర్ హర్ష సాయి.. పోలీసుల గాలింపు.. నాలుగు బృందాలతో..

Date : 26 September 2024 11:39 AM Views : 288

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Harsha Sai : ఇటీవల యూట్యూబర్ హర్ష సాయిపై ఓ నటి, నిర్మాత లైంగిక ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన నిర్మాణంలో హర్ష సాయితో చేస్తున్న మెగా అనే సినిమా కాపీ రైట్స్ విషయంలోనే తనను లైంగికంగా వేధించాడని, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసాడని, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసాడని ఆ నటి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద హర్ష సాయిపై కేసు నమోదు చేసారు. హర్ష సాయి తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేసారు. ఇప్పటికే బాధితురాలకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక దీనిపై హర్ష సాయి తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. కేవలం డబ్బుల కోసమే ఆరోపణలు చేస్తున్నారు. నా లాయర్లు చూసుకుంటారు అని అన్నాడు. అయితే ప్రస్తుతం యూట్యూబర్ హర్ష సాయి పరారీలో ఉన్నాడు. హర్ష సాయికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. హర్ష సాయి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. నాలుగు బృందాలుగా హర్ష సాయి కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. హర్ష సాయి ముంబైలో ఉన్నట్టు సమాచారం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :