Saturday, 24 January 2026 02:57:06 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Baahubali The Epic: రీరిలీజ్‌లోనూ 'బాహుబలి' రికార్డుల మోత.. వసూళ్లు ఎంతంటే?

Date : 20 November 2025 07:15 PM Views : 157

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : రీరిలీజ్‌లోనూ సత్తా చాటిన 'బాహుబలి' ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల గ్రాస్ వసూళ్లు కొత్త సినిమాలను మించిపోయిన కలెక్షన్లు రీరిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించిన వైనం తెలుగు రాష్ట్రాల్లోనే 23 కోట్ల వసూళ్లు ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన అద్భుత దృశ్యకావ్యం 'బాహుబలి' రీరిలీజ్‌లోనూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఇటీవల విడుదల చేయగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 53 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. రీరిలీజ్ అయిన సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఒక చారిత్రక విజయంగా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు చూస్తే, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ. 23 కోట్లు రాబట్టింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ కలిపి రూ. 9.8 కోట్లు, హిందీలో రూ. 8.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతూ 12 కోట్ల రూపాయల గ్రాస్ వ‌సూలు చేసింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న కొత్త సినిమాలను కూడా వెనక్కి నెట్టి 'బాహుబలి' ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం విశేషం. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్ స్టార్‌డమ్‌కు ప్రేక్షకులు మరోసారి బ్రహ్మరథం పట్టారని ఈ వసూళ్లు రుజువు చేస్తున్నాయి. మొత్తం మీద 'బాహుబలి' రీరిలీజ్‌లో అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా నిలిచి, భారతీయ సినిమాలో తన స్థానం ఎప్పటికీ పదిలమని మరోసారి చాటిచెప్పింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :