Saturday, 24 January 2026 01:12:01 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

iBomma Ravi | ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ.. సజ్జనార్‌కు లేఖ

iBomma Ravi | ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్‌ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు లేఖ రాసింది.

Date : 18 November 2025 07:52 PM Views : 338

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : iBomma Ravi | ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్‌ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు లేఖ రాసింది. కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని కోరింది. ఇమ్మడి రవి బ్యాంకు ఖాతాల నుంచి ఇప్పటికే పోలీసులు రూ.3.5 కోట్లను ఫ్రీజ్‌ చేశారు. బెట్టింగ్‌ యాప్స్‌ నుంచి ప్రకటనల రూపంలో రవికి డబ్బులు అందినట్లు తెలంగాణ పోలీసుల దర్యాప్తులో తేలింది. క్రిప్టోవాలెట్‌ నుంచి రవి ఎన్నారై ఖాతాకు నెలకు రూ.15 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయి. విదేశీ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ కావడంతో మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేయాలని ఈడీ నిర్ణయించింది. పట్టుకోండి చూద్దాం ఐబొమ్మ నిర్వాహకులు గతంలో పోలీసులకు సవాల్‌ విసిరారు. దమ్ముంటే తమను పట్టుకోవాలని వెబ్‌సైట్‌లో పోస్ట్‌ పెట్టారు. ఈ నేపథ్యంలో సినీపరిశ్రమ పెద్దల ఫిర్యాదుతో పోలీసులు 69 వెబ్‌సైట్లపై కేసు నమోదు చేశారు. ఇంతకుముందు హైదరాబాద్‌ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌, ప్రస్తుత సీపీ వీసీ సజ్జనార్‌ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. సీవీ ఆనంద్‌ బదిలీ అయ్యే ముందు.. థియేటర్లలో సినిమాలు రికార్డ్‌చేస్తూ సర్వర్లు హ్యాక్‌ చేస్తున్న ఐదుగురు కీలక నిందితులను అరెస్ట్‌ చేశారు. ఐబొమ్మ నిర్వాహకులపై కూడా నిఘా పెట్టామని, త్వరలోనే పట్టుకుంటామని అప్పుడే మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆ తర్వాత పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఐబొమ్మ నిర్వాహకుల కదలికలను సాంకేతిక ఆధారాల ద్వారా పసిగట్టారు. కూకట్‌పల్లిలోని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఇమ్మడి రవిని అరెస్ట్‌ చేశారు. అతని అకౌంట్‌లోని రూ.3 కోట్లను ఫ్రీజ్‌ చేశారు. రవితోపాటు ఇతరుల పేర్లతో బ్యాంకు ఖాతాల్లో వందల కోట్లు ఉన్నట్టు పోలీసులు వివరాలు సేకరించారు. ఇమ్మడి రవిని విచారించే క్రమంలో కీలకమైన సమాచారం రాబట్టినట్టు తెలిసింది. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఐబొమ్మ నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా ఉన్నదని, గతంలో బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో ఐబొమ్మ ఏజెంట్లను అరెస్ట్‌ చేశామని పోలీసులు చెప్పారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌కు కీలకంగా పనిచేసిన రవి అరెస్ట్‌ తర్వాత మరికొన్ని అరెస్ట్‌లు ఉంటాయని తెలుస్తున్నది. ఇప్పటికే ఏపీ , తెలంగాణలతోపాటు పలు రాష్ర్టాల్లో ఐబొమ్మ నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి. పైరసీ వ్యవహారం మొత్తం రవి ఒక్కడే నడిపిస్తున్నాడా లేక అతని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దృష్టిపెట్టారు. ఐబొమ్మలో బెట్టింగ్‌ యా ప్‌ల ప్రకటనల ద్వారా కూడా రవి కోట్ల రూపాయలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. సీసీఎస్‌లో విచారణ తర్వాత రవిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇమ్మడి రవి ఎలా దొరికిపోయాడంటే! పోలీసులకే సవాల్‌ విసురుతూ వైబ్‌సైట్‌ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి పట్టుబడటం వెనుక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. బెట్టింగ్‌ యాప్స్‌ కేసు దర్యాప్తులో పోలీసులకు కొన్ని అకౌంట్స్‌ వివరాలు లభించాయి. ఇందులో ఐబొమ్మతో జరిపిన లావాదేవీలు బయటపడ్డాయి. వీటి ఆధారంగా కూపీ లాగగా.. ఐబొమ్మ గుట్టురట్టయిందని తెలుస్తున్నది. అలాగే రవి భార్య పోలీసులకు ఇచ్చిన సమాచారం అరెస్ట్‌కు అత్యంత కీలకమైనట్టు సమాచారం. వైజాగ్‌కు చెందిన ఇమ్మడి రవి కరేబియన్‌దీవుల్లో ఐబొమ్మ ఆఫీసు నడిపిస్తున్నాడు. తనతో పనిచేసిన అశ్విన్‌కుమార్‌, కిరణ్‌కుమార్‌లాంటి వారికి లక్షల రూపాయలు చెల్లించేవాడు. బెట్టింగ్‌ యాప్స్‌ నుంచి జరిగిన లావాదేవీల సమాచారం తీసుకున్న పోలీసులు.. ఇమ్మడి రవి భార్యను విచారించారు. ఇప్పటికే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి. విడాకులు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్మడి రవి హైదరాబాద్‌కు వస్తున్నట్టు అతని భార్య పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఒక్కొక్కరుగా చిక్కిన హ్యాకర్లు ఐబొమ్మకు చెందిన అశ్విన్‌కుమార్‌ అనే హ్యాకర్‌ను పోలీసులు నిరుడు సెప్టెంబర్‌ చివరలో హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అదే సమయంలో జానా కిరణ్‌కుమార్‌తోపాటు మరో పదిమందిని అశ్విన్‌కుమార్‌ను విచారించే సమయంలో వాళ్లు సమాచారంతో మొత్తం పైరసీ సిండికేట్‌కు సంబంధించిన కీలక విషయాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఒక్కొక్కరిని పట్టుకున్నారు. అయితే సినీవర్గాలు తమ సినిమా పైరసీ కాకుండా హైలెవల్‌ సెక్యూరిటీ కోసం డిజిటల్‌ సర్వర్లలో భద్రపర్చుకుంటారు. కానీ ఆ సర్వర్లను కూడా ఐబొమ్మ నిర్వాహకులు హ్యాక్‌ చేసి, తమ దగ్గర సర్వర్‌ నుంచి పైరసీ సైట్లకు పంపిస్తుంటారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి కూడా ఒక సర్వర్‌నే నమ్ముకోకుండా మరో పది సర్వర్‌లను ముందు జాగ్రత్తగా నిర్వహించేవాడని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఒకవేళ ఐబొమ్మ మూతపడితే.. ప్రత్యామ్నాయంగా వాడుకునేందుకు మరో 65 వెబ్‌సైట్లను సిద్ధం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :