Saturday, 24 January 2026 03:04:20 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Tamannaah Bhatia: లెజెండరీ దర్శకుడి బయోపిక్‌లో తమన్నా.. బాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్!

Date : 01 December 2025 06:27 PM Views : 130

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ దర్శకుడు వి. శాంతారాం బయోపిక్‌లో తమన్నా ఆయన భార్య, నటి సంధ్య పాత్రను పోషించనున్న మిల్కీ బ్యూటీ శాంతారాం పాత్రలో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది కెరీర్‌లో విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్న నటి తమన్నా భాటియాకు బాలీవుడ్ నుంచి మరో ప్రతిష్ఠాత్మక అవకాశం వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. భారతీయ సినిమా దిగ్గజ దర్శకుల్లో ఒకరైన వి. శాంతారాం జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో ఆమె నటించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో శాంతారాం భార్య, అలనాటి ప్రముఖ నటి సంధ్య పాత్రలో తమన్నా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ‘చిత్రపతి వి. శాంతారాం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. బాలీవుడ్ యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన ‘నటసామ్రాట్’ చిత్ర దర్శకుడు అభిజిత్ దేశ్‌పాండే ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. వి. శాంతారాం దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో సంధ్య హీరోయిన్‌గా నటించారు. హిందీ, మరాఠీ భాషల్లో ఆమెకు మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఈ బయోపిక్‌లో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ విన్న వెంటనే తమన్నా పాత్ర చేయడానికి ఎంతో ఆసక్తి చూపి అంగీకరించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న ఆమె కెరీర్‌లో ఈ పాత్ర మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వి. శాంతారాం సినీ ప్రస్థానం, ఆయన ప్రయోగాలు, వ్యక్తిగత జీవితంలోని కీలక ఘట్టాలను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :