Saturday, 17 January 2026 10:20:41 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

అల్లు అర్జున్‌ మామకు చేదు అనుభవం!

గాంధీభవన్ కు వెళ్లిన చంద్రశేఖర్ రెడ్డి దీపా దాస్ మున్షీతో మాట్లాడేందుకు యత్నించిన వైనం ఆయనతో మాట్లాడేందుకు నిరాకరించిన దీపా దాస్ మున్షీ

Date : 23 December 2024 04:11 PM Views : 331

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, ఒక రాత్రి జైలు జీవితాన్ని గడపడం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ పై ఉన్నారు. తొక్కిసలాటకు, ఒక మహిళ ప్రాణం పోవడానికి అల్లు అర్జున్ కారణమని ముఖ్యమంత్రి, ఇతరు మంత్రులు కూడా కామెంట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అంతుచిక్కని విధంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (బన్నీ భార్య స్నేహా రెడ్డి తండ్రి) గాంధీభవన్ కు వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ ఈరోజు గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం అనంతరం తన ఛాంబర్ లోకి ఆమె వెళ్లారు. ఆమెను అనుసరిస్తూ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆమె ఛాంబర్ లోకి వెళ్లారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయనతో మాట్లాడేందుకు దాపా దాస్ మున్షీ నిరాకరించారు. దీంతో, ఆయన వెంటనే గాంధీభవన్ నుంచి వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులు ఆయనను మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి... ఆ తర్వాత కాంగ్రెస్ లోకి చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి, అల్లు అర్జున్ కు గ్యాప్ పెరిగిపోయిన నేపథ్యంలో ఆయన రంగంలోకి దిగినట్టు చెపుతున్నారు.

Also Read : విజయసాయి ముఠాపై సమగ్ర విచారణ జరిపించాలి: సోమిరెడ్డి

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :