Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Akkineni fans – Konda Surekha : మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్‌లో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ నటీనటులు ఒక్కతాటిపైకి వచ్చి ఈ విషయన్ని తీవ్రంగా ఖండించారు. గౌరవప్రదమైన స్థానంలో ఉంటూ ఇలాంటి మాటలు తగవని మండిపడుతున్నారు.మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌లో మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నాగార్జునకు, అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Admin
Studio18 News