Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Prasanth Varma : హనుమాన్ సినిమాతో భారీ విజయం సాధించి ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇకపై తన నుంచి, తన నిర్మాణంలో వచ్చేవి అన్ని తన సినిమాటిక్ యూనివర్స్ లో వస్తాయని ప్రకటించాడు. హనుమాన్ తర్వాత జై హనుమాన్, బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞతో ఒక సినిమా ప్రకటించారు. ఇటీవల దసరాకు మహాకాళి అనే సినిమాను ప్రకటించాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో సినిమా అంటూ మహాకాళి సినిమాని ప్రకటించారు. మహాకాళి పోస్టర్, టైటిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా అందులో ఓ పులి, ఓ చిన్నపిల్ల హత్తుకొని ఉన్నట్టు చూపించారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ కావాలని క్యాస్టింగ్ కాల్ యాడ్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మహాకాళి సినిమాలో నటించడానికి, ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో పాత్రలో నటించడానికి అమ్మాయి కావాలి అంటూ ఓ యాడ్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. కొంచెం డార్క్ టోన్ లో ఉండి, ఏజ్ 16 – 25 మధ్య ఉండి యాక్టింగ్, డ్యాన్స్ వచ్చిన ఇండియన్ అమ్మాయి కావలి అంటూ ప్రకటన ఇచ్చాడు. ఆసక్తి ఉన్నవాళ్లు తమ డీటెయిల్స్ ని పంపించండి అంటూ ఓ మెయిల్ ఐడి కూడా ఇచ్చాడు. మరి ఎవరైనా కొత్తగా హీరోయిన్ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ట్రై చేసేయండి. ఇక మెయిన్ లీడ్ ని సెలెక్ట్ చేయకుండానే సినిమా అనౌన్స్ చేయడంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు. కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తున్నందుకు కొంతమంది అభినందిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పక్కాగా చేసుకొని మెయిన్ లీడ్ దొరికితే షూట్ కి వెళ్లిపోవడమే అని తెలుస్తుంది. మొత్తానికి తన సినిమాలకు సంబంధించిన ఏ వార్తతో అయినా ప్రశాంత్ వర్మ ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తున్నాడు.
Admin
Studio18 News