Monday, 19 January 2026 07:27:36 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు

Date : 13 November 2025 07:25 PM Views : 247

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలన్న కాజోల్ సెలబ్రిటీ టాక్ షోలో వివాహంపై ఆసక్తికర చర్చ కాజోల్ అభిప్రాయంతో విక్కీ కౌశల్, కృతి సనన్ విభేదం సీనియర్ బాలీవుడ్ నటి కాజోల్ వివాహ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. పెళ్లికి కూడా ఓ ‘ఎక్స్‌పైరీ డేట్’ (గడువు తేదీ), ‘రెన్యువల్ ఆప్షన్’ (పునరుద్ధరణ అవకాశం) ఉండాలని ఆమె పేర్కొనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా 26 ఏళ్లుగా వైవాహిక బంధంలో కొనసాగుతున్న ఆమె ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ట్వింకిల్ ఖన్నా, కాజోల్ కలిసి నిర్వహిస్తున్న ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే సెలబ్రిటీ టాక్ షో తాజా ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్వింకిల్ ఖన్నా “వివాహానికి గడువు తేదీ, రెన్యువల్ ఆప్షన్ ఉండాలా?” అని ప్రశ్నించారు. దీనికి విక్కీ, కృతి, ట్వింకిల్ ‘వద్దు’ అని చెబుతూ రెడ్ జోన్‌లో నిలబడగా, కాజోల్ మాత్రం ‘అవును’ అంటూ గ్రీన్ జోన్‌లోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. వెంటనే ట్వింకిల్ ఖన్నా సరదాగా “అది పెళ్లి.. వాషింగ్ మెషీన్ కాదు కదా!” అని చమత్కరించారు. దీనికి కాజోల్ బదులిస్తూ, “నేను నిజంగానే అలా అనుకుంటున్నాను. మనం సరైన సమయంలో సరైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని ఎవరు హామీ ఇస్తారు? గడువు ఉంటే ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు. అలాగే, రెన్యువల్ ఆప్షన్ ఉంటే ఆ బంధానికి కొత్త అర్థం వస్తుంది” అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించారు. అదే షోలో “డబ్బుతో ఆనందాన్ని కొనుగోలు చేయవచ్చా?” అనే మరో ప్రశ్న రాగా... కాజోల్ ‘లేదు’ అని సమాధానమిచ్చారు. “డబ్బు ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు నిజమైన సంతోషాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా కోల్పోతాం” అని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమం చివర్లో ట్వింకిల్ సరదాగా “బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి మాజీలతో డేటింగ్ చేయకూడదు” అని కాజోల్‌ను ఆటపట్టించగా, ఆమె నవ్వుతూ “నోరు మూయ్!” అంటూ స్నేహపూర్వకంగా హెచ్చరించారు. వీరి మధ్య జరిగిన ఈ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న ఈ షోకు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, అలియా భట్ వంటి ప్రముఖులు రాబోయే ఎపిసోడ్‌లలో పాల్గొననున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :