Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సినీ కళామతల్లి ముద్దుబిడ్డ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఈరోజు తలుచుకోవడం మనకు గర్వకారణమని అన్నారు. ఆయన పోషించిన పాత్రలు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి నటుడికి ఆయన కృషి, కీర్తి, స్ఫూర్తి మార్గదర్శకమని చెప్పారు. సినీ రంగానికి అపారమైన సేవలు అందించిన నాగేశ్వరావు గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుదామని అన్నారు. నాటకరంగం నుంచి చిత్రరంగం వరకు ఆయన చేసిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. ఈరోజు ఆయనకు నివాళి అర్పిస్తూ, ఆయన సాధించిన విజయాలను స్మరించుకుందామని అన్నారు.
Admin
Studio18 News