Monday, 19 January 2026 07:04:39 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?

Sunaina Yella | రాజ రాజ చోర సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న సునయన యెల్ల 2025లో కుబేర సినిమాలో మెరిసింది. అయితే వ్యక్తిగత జీవితంలో కొత్త చాప

Date : 09 December 2025 07:57 PM Views : 116

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sunaina Yella | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి సునయన యెల్ల. తెలుగులో కుమారి వర్సెస్‌ కుమారి సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. రాజ రాజ చోర సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ 2025లో కుబేర సినిమాలో మెరిసింది. అయితే వ్యక్తిగత జీవితంలో కొత్త చాప్టర్‌ను మొదలుపెట్టబోతుందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతుందట. ఇంతకీ ఈ బ్యూటీని చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా..? పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌ (కంటెంట్‌ క్రియేటర్‌) ఖలీద్‌ అల్‌ అమేరి.. అవును సోషల్ మీడియా ద్వారా ఇదే విషయంపై ఓ హింట్ ఇచ్చాడు ఖలీద్‌. సోషల్ మీడియాలో ఉన్న వన్‌ ఆఫ్‌ ది మోస్ట్ పాపులర్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌లో ఒకడు ఖలీద్‌. ఇతడికి యూట్యూబ్‌లో 5.82 మిలియన్ల సబ్‌ స్క్రైబర్లు ఉండటమే కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.2 మిలియన్ల ఫాలోవర్లున్నారు. ఖలీద్‌ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో తన బర్త్‌ డే పార్టీకి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇందులో ఒక ఫొటోలో ఖలీదు సునయనతో ఉండటం చూడొచ్చు. అందమైన పుట్టినరోజు జరిపినందుకు ధన్యవాదాలు.. అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు ఖలీదు. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు, ఫాలోవర్లు ఈ ఇద్దరి రిలేషన్‌షిప్‌ నిజమేనని.. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని అంచనా వేస్తున్నారు. మరి ఈ విషయాన్ని సునయన కానీ, ఖలీద్‌ కానీ అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి. నాగ్‌పూర్‌లోని తెలుగు కుటుంబంలో జన్మించిన సునయన యెల్ల తమిళంలో మంచి ఫేం సంపాదించింది. కుబేరలో నాగార్జున భార్యగా నటించింది. సునయన 2024లో ఓ వ్యక్తి చేయి పట్టుకొని కనిపించడంతో.. ఖలీద్‌తో డేటింగ్‌లో ఉందంటూ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత ఖలీద్‌ తన ప్రియురాలి చేతిలో చేయి వేసి ఉన్న స్టిల్‌లో ఎంగేజ్‌మెంట్‌ రింగ్స్‌ కనిపించాయి. దీనిని సునయన లైక్‌ చేయడంతో డేటింగ్‌ రూమర్లు మరింత ఊపందుకున్నాయి. ఖలీద్‌ ఇప్పటికే సలామా మహ్మద్‌ను పెళ్లి చేసుకోగా.. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే 2007లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2024లో విడాకులు తీసుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :