Sunday, 08 March 2026 04:06:23 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

ఊహించని మలుపులతో సాగే ఉత్కంఠభరిత సిరీస్... 'వికటకవి'

యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ గా 'వికటకవి' ప్రధాన పాత్రల్లో నరేశ్ అగస్త్య - మేఘ ఆకాశ్ 1940 - 70లలో నడిచే కథ ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీ

Date : 16 November 2024 02:28 PM Views : 322

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నరేశ్ అగస్త్య కథానాయకుడిగా 'వికటకవి' అనే టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ రూపొందింది. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సిరీస్ కి, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ డిటెక్టివ్ సిరీస్ లో, హీరోకి జోడీగా మేఘ ఆకాశ్ అలరించనుంది. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఫస్టు డిటెక్టివ్ సిరీస్ గా దీనిని చెబుతున్నారు. జీ 5 ప్లాట్ ఫామ్ పై ఈ నెల 28 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ కథ 1940లలో... 1970లలో నడుస్తుంది. ఆ కాలాలకి సంబంధించిన వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఈ కథను నడిపించడం అంత తేలికైన విషయం కాదు. ఆ కాలాలకు సంబంధించిన సామాజిక జీవన విధానాన్ని చూపించడానికి ఎంతో కసరత్తు చేయవలసి ఉంటుంది. అలాంటి ఒక కష్టతరమైన కంటెంట్ తో నిర్మితమైన ఈ సిరీస్ ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 1940లలో 'అమరగిరి' ప్రాంతంలో ఒక మరిచిపోలేని సంఘటన జరుగుతుంది. 1970లలో అదే సంఘటన మళ్లీ జరుగుతుంది. దాంతో అందుకు కారణం తమ గ్రామదేవతకి కోపం రావడమేనని అక్కడి వాళ్లంతా భావిస్తారు. ఈ విషయాన్ని ఛేదించడానికి డిటెక్టివ్ 'వికటకవి' రంగంలోకి దిగుతాడు. ఫలితంగా ఏం జరుగుతుందనేది కథ.

Also Read : ఏపీలో ఆరు చోట్ల కొత్త ఎయిర్ పోర్టులు... ఎక్కడంటే!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :