Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Kali Movie : యువ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య కలిసి నటించిన సినిమా ‘కలి’. కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్ బ్యానర్లో లీలా గౌతమ్ వర్మ నిర్మాణంలో శివ శేషు దర్శకత్వంలో కలి సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కలి సినిమా అక్టోబర్ 4న థియేటర్స్ లో రిలీజవ్వగా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. కలి సినిమా అక్టోబర్ 17వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. కష్టాలు వస్తే ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే ఓ వ్యక్తికి కలిపురుషుడు కనిపించి ఏం చేసాడు అని ఆసక్తిగా తెరకెక్కించారు కలి సినిమాని. థియేటర్స్ లో మిస్ అయితే మరో రెండు రోజుల్లో ఓటీటీలో చూసేయండి.
Admin
Studio18 News