Saturday, 24 January 2026 02:29:17 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Govinda: హీరో గోవిందాకు ఏమైంది?.. అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు

Date : 12 November 2025 07:34 PM Views : 239

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందాకు అస్వస్థత మంగళవారం రాత్రి ఇంట్లో స్పృహతప్పి పడిపోయిన హీరో వెంటనే ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలింపు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న గోవిందా పలు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపిన సన్నిహితులు ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా (61) అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయన తన నివాసంలో స్పృహతప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ముంబై జుహూలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గోవిందా స్నేహితుడు, న్యాయ సలహాదారు అయిన లలిత్ బిందాల్ ఈ విషయాన్ని ఎన్డీటీవీకి తెలియ‌జేశారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్నప్పుడు గోవిందా ఒక్కసారిగా కళ్లు తిరిగి స్పృహ కోల్పోయారని తెలిపారు. వెంటనే ఫోన్‌లో డాక్టర్‌ను సంప్రదించి, ఆయన సూచన మేరకు మందులు ఇచ్చామని చెప్పారు. ఆ తర్వాత పరిస్థితిని గమనించి, అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేర్పించినట్లు వివరించారు. ప్రస్తుతం గోవిందాకు వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించారని, వాటికి సంబంధించిన రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని బిందాల్ పేర్కొన్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. ఈ వార్త తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, గతేడాది అక్టోబర్‌లో కూడా గోవిందా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను అల్మరాలో పెడుతుండగా అది ప్రమాదవశాత్తు కిందపడి పేలింది. ఈ ఘటనలో ఆయన కాలికి బుల్లెట్ గాయమైంది. అప్పుడు కూడా ఇదే క్రిటికేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. గంటపాటు జరిగిన శస్త్రచికిత్స అనంతరం వైద్యులు బుల్లెట్‌ను విజయవంతంగా తొలగించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :