Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : హీరోగా విష్వక్సేన్ తనకి నచ్చిన కథలను .. పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మెకానిక్ రాకీ' రెడీ అవుతోంది. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకి, రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించాడు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, మీనాక్షి చౌదరి .. శ్రద్ధా శ్రీనాథ్ .. సునీల్ .. నరేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్వక్సేన్ మాట్లాడుతూ, దర్శకుడు ఈ కథను ఇంటర్వెల్ వరకూ చెప్పినప్పుడు, చేయనని అందామని ఫిక్స్ అయ్యాను. కానీ ఇంటర్వెల్ తరువాత నుంచి చెప్పడం మొదలు పెట్టినప్పుడు, తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యాను. సెకండాఫ్ అంత కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికీ ఈ కథ నచ్చుతుంది" అని అన్నాడు. " ఈ సినిమాలో నేను మలక్ పేటకి చెందిన మెకానిక్ గా కనిపిస్తాను. ఆ పాత్ర నాకు చాలా దగ్గరగా అనిపించింది. ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుందనే నమ్మకం కలిగింది. అందువల్లనే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ రోజున స్టేజ్ పై ఒక మాట చెప్పాను. ముందురోజు రాత్రి ప్రివ్యూ కి రండి .. నచ్చలేదనే టాక్ వస్తే సినిమాకి రాకండి అని అన్నాను. అది ఛాలెంజ్ చేయడం కాదు .. నా సినిమాపై నాకున్న నమ్మకం .. ఆడియన్స్ కి నేను ఇచ్చిన భరోసా" అని చెప్పాడు.
Also Read : కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
Admin
Studio18 News