Sunday, 08 March 2026 09:28:36 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Mahesh babu: రాజమౌళి సినిమాలో మహేశ్ లుక్‌ ఇది కాదా?

Date : 25 September 2024 03:40 PM Views : 579

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి ఏ సినిమా చేసినా, ఏ హీరోతో చేసినా అది సెన్సేషనే. తెలుగు సినిమాను ఖండాంతరాలు దాటించిన ఈ దర్శకధీరుడు తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. అడ్వెంచరస్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా.. ఇండియానా జోన్స్‌ తరహాలో రూపొందనున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు లుక్‌ చాలా వైవిధ్యంగా వుండబోతోంది. మునుపెన్నడూ చూడని రీతిలో ఈ చిత్రంలో ఈ ఘట్టమనేని హీరోని చూడబోతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో మహేశ్ కనిపించబోయే లుక్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. లాంగ్‌ హెయిర్‌స్టయిల్‌, గుబురు గడ్డంతో మహేశ్ ఇటీవల పలు వేడుకల్లో కనిపించాడు. అంతేకాదు ఇటీవల మహేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసినప్పటి ఫొటోలు బయటికొచ్చాయి. ఈ ఫొటోల్లో తమ హీరో హ్యాండ్‌సమ్‌గా కనిపించారని మహేశ్ అభిమానులు అనుకుంటున్నారు. అయితే జనరల్‌గా ఎస్.ఎస్‌.రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసినా ఆ హీరో సదరు గెటప్‌కు మారిపోయే మేకోవర్‌లో, సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు, పబ్లిక్‌ ఫంక్షన్స్‌లో గెటప్‌ రివీల్‌ కాకుండా చూసుకోమని కోరతాడు. ఇంతకు ముందు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక సినిమాలు చేసిన ప్రభాస్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఈ పాలసీని ఫాలో అయ్యేవారు. కానీ మహేశ్ మాత్రం న్యూ గెటప్‌లో ఇప్పటికే పలుసార్లు పబ్లిక్‌లో కనిపించడంతో పాటు ఫొటోలకు కూడా పోజులు ఇస్తున్నాడు. ఇదే రాజమౌళి సినిమాలో గెటప్‌ అంటూ ఆ ఫొటోలు వైరల్‌ కూడా అవుతున్నాయి. ఈ విషయంలో మహేశ్ కు రాజమౌళి ఎటువంటి ఆంక్షలు పెట్టలేదా? అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు. అయితే రాజమౌళి సినిమాలో మహేశ్ కంప్లీట్‌ లుక్‌ ఇది కాదని.. కేవలం ఇది ప్రారంభం మాత్రమేనని, మహేశ్ కంప్లీట్‌ మేకోవర్‌కు ఇంకాస్త టైమ్‌ పడుతుందని అంటున్నారు. ఏది ఏమైనా మహేశ్ లుక్‌ మాత్రం బాగుందని అభిమానులు మాత్రం ఫుల్‌ ఖుషీలో వున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :