Saturday, 24 January 2026 08:34:24 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

క‌ర్ణాట‌క‌లో 'థ‌గ్ లైఫ్' విడుదలపై నీలినీడలు.. హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్

Date : 02 June 2025 04:27 PM Views : 196

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ నటుడు కమల్ హాసన్ "తమిళం నుంచే కన్నడ పుట్టింది" అంటూ చేసిన వ్యాఖ్యలు సృష్టించిన వివాదం చల్లారే సూచనలు కనిపించడం లేదు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే, ఆయన నటిస్తున్న 'థ‌గ్ లైఫ్' చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల కానివ్వబోమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించడంతో కమల్ హాసన్ నేడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం. నరసింహులు మాట్లాడుతూ... "ఆయన క్షమాపణ చెప్పకపోతే కర్ణాటకలో 'థ‌గ్ లైఫ్' విడుదల కాదు. ఇది ఖాయం. ఇది పరిశ్రమకు సంబంధించిన విషయం కాదు. రాష్ట్రానికి సంబంధించింది. రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కన్నడ అనుకూల సంస్థలు ఆయన స్పందించాలని కోరాయి. ఆయన క్షమాపణ చెప్పకుండా సినిమా విడుదల కావడం కష్టం. మా ఎగ్జిబిటర్లు గానీ, డిస్ట్రిబ్యూటర్లు గానీ సినిమాను ప్రదర్శించడానికి సిద్ధంగా లేరు. అలాంటప్పుడు సినిమా ఇక్కడ ఎలా విడుదలవుతుంది?" అని ప్రశ్నించారు. అటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని, ఆ విషయం కమల్ హాసన్‌కు తెలియదని అన్నారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. "మాతృభాషను ప్రేమించాలి. కానీ దాని పేరుతో అహంకారం ప్రదర్శించడం సాంస్కృతిక దివాలాకోరుతనానికి నిదర్శనం. ముఖ్యంగా కళాకారులకు, ప్రతి భాషను గౌరవించే సంస్కారం ఉండటం చాలా అవసరం" అని ఆయన అన్నారు. కన్నడతో సహా పలు భాషల్లో చిత్రాలు చేసిన కమల్ హాసన్ వ్యాఖ్యలు పూర్తిగా అహంకార పూరిత‌మైన‌వి అని బీజేపీ నేత విమర్శించారు. ఇప్ప‌టికే అనేక కన్నడ సంఘాలు కూడా క‌మ‌ల్‌ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే, తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కమల్ హాసన్ స్పష్టం చేశారు. "ఇది ప్రజాస్వామ్యం. నేను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతాను. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలపై నాకు ఉన్న ప్రేమ నిజమైంది. ఏదో ఒక అజెండా ఉన్నవాళ్లు తప్ప ఎవరూ దానిని అనుమానించరు. నన్ను గతంలో కూడా బెదిరించారు. నేను తప్పు చేసి ఉంటే క్షమాపణ చెబుతాను. తప్పు చేయకపోతే చెప్పను" అని ఆయన స్ప‌ష్టం చేశారు. ఈ పరిణామాలతో 'థ‌గ్ లైఫ్' సినిమా విడుదలపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :