Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తమ విచారణకు హాజరుకావాలంటూ వర్మకు ఇంతకు ముందే నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం నిన్న ఆయన పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, సినిమా పనుల్లో బిజీగా ఉన్నానని, విచారణకు హాజరు కావడానికి తనకు కొంత సమయం కావాలని వర్మ కోరారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సీఐకి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో, వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు పంపించారు. ఈ నెల 25వ తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలంటూ వర్మ వాట్సాప్ కు సీఐ శ్రీకాంత్ నోటీసులు పంపారు.
Also Read : బుడమేరుకు వరదలపై మంత్రి రామానాయుడు కీలక వ్యాఖ్యలు
Admin
Studio18 News