Sunday, 08 March 2026 04:47:14 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Bhanupriya: భానుప్రియను మరచిపోలేకపోతున్న ఫ్యాన్స్!

Date : 09 September 2025 07:06 PM Views : 438

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఐదు భాషల్లో నటించిన భానుప్రియ ఆకర్షణీయమైన కళ్లు ఆమె ప్రత్యేకత క్లాసికల్ డాన్సర్ గా మరింత గుర్తింపు భర్త మరణం తరువాత వచ్చిన మార్పు జ్ఞాపకశక్తి తగ్గిందన్న భానుప్రియ తెలుగు తెరకి అందమైన కాటుక కళ్లను పరిచయం చేసిన కథానాయిక భానుప్రియ. వెండితెర దిశగా అడుగులు వేసిన మంగభాను .. భానుప్రియగా మారడం వెనుక ఎంతో కృషి ఉంది. అప్పట్లో కాస్తరంగు తక్కువగా ఉన్నవారికి అవకాశాలు అంతంత మాత్రంగా ఉండేవి. అయినా సావిత్రి .. వాణిశ్రీ సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని భానుప్రియ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా భానుప్రియ కెమెరా ముందుకు వచ్చారు. విశాలమైన కళ్లు .. చలాకీ చూపులు .. చక్కని పలువరుస .. ఆకర్షణీయమైన నవ్వు .. ఆకట్టుకునే వాయిస్ భానుప్రియ ప్రత్యేకతలుగా అప్పటి విశ్లేషకులు రాసుకొచ్చారు. అలాంటి భానుప్రియ వరుస అవకాశాలను అందుకోవడానికీ .. స్టార్ డమ్ ను దక్కించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. నటన పరంగా .. గ్లామర్ పరంగా .. డాన్సుల పరంగా తనకి గట్టి పోటీగా ఉన్న విజయశాంతి - రాధలను తట్టుకుని నిలబడటానికి భానుప్రియ మరింత కష్టపడవలసి వచ్చింది. అందుకు ఆమె నేర్చుకున్న క్లాసికల్ డాన్స్ ఎంతో ఉపయోగపడింది. ఐదు భాషల్లో అనేక చిత్రాలలో నటించిన భానుప్రియ, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగాను కొన్ని సినిమాలలో నటించారు. ఆ తరువాత ఆమె ఎక్కడా కనిపించలేదు. వైవాహిక జీవితంలోని ఒడిదుడుకులు .. భర్త మరణం ఆమెను కుంగదీశాయని చెప్పుకున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం వలన తనకి డైలాగ్స్ గుర్తుండటం లేదనీ, అందువలన సినిమాలు మానేశానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది జరిగి చాలాకాలమే అవుతుంది. ఆ తరువాత ఆమె గురించి ఏమీ తెలియకుండా పోయింది. దాంతో ఆమెను గురించిన సమాచారం ఏదైనా లభిస్తుందేమోనని అభిమానులు సెర్చ్ చేస్తూనే ఉన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :