Monday, 19 January 2026 08:46:48 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Mahavatar Narasimha: 'మహావతార్ నరసింహ'.. పాకిస్థాన్‌లోనూ ప్రశంసలు!

Date : 03 December 2025 06:13 PM Views : 97

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఆస్కార్ బరిలో నిలిచిన భారత యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా పాకిస్థాన్‌లోని కరాచీ ఆలయంలో హిందువుల కోసం ప్రత్యేక ప్రదర్శన భారీ తారాగణం, పెద్ద ప్రచార ఆర్భాటం లేకుండానే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన భారత యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ఈ సినిమా... 98వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. విడుదలైన తొలి రోజు నుంచే మౌత్ టాక్‌తో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆధునిక యానిమేషన్ టెక్నాలజీతో నరసింహ పురాణం, విష్ణు పురాణంలోని ఘట్టాలను కళ్లకు కట్టినట్టు చూపించడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలోనే కాకుండా, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ప్రస్తుతం 98వ ఆస్కార్ అవార్డుల కోసం ‘ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్’ కేటగిరీలో పోటీ పడుతున్న 35 చిత్రాల ప్రాథమిక జాబితాలో ‘మహావతార్ నరసింహ’ చోటు దక్కించుకుంది. జనవరి 22న ప్రకటించే తుది నామినేషన్లలో ఈ చిత్రం ఎంపికైతే, ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ యానిమేషన్ చిత్రంగా చరిత్ర సృష్టిస్తుంది. మరోవైపు, ‘హోంబౌండ్’ చిత్రం ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇటీవల ఈ చిత్రాన్ని పాకిస్థాన్‌లోని కరాచీ స్వామి నారాయణ దేవాలయంలో ప్రదర్శించడం విశేషం. ఈ ప్రదర్శనకు వందలాదిగా తరలివచ్చిన పాకిస్థానీ హిందువులు, వెండితెరపై నరసింహస్వామి కథను చూసి భావోద్వేగానికి గురయ్యారు. పురాణాల ప్రకారం, హిరణ్యకశ్యపుడి స్వస్థలం నేటి పాకిస్థాన్‌లోని ముల్తాన్ అని, నరసింహావతారం అక్కడే జరిగిందని స్థానిక పండితులు చెబుతుండటం ఈ సందర్భంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :