Sunday, 25 January 2026 04:37:03 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Darshan: నాకు విషం ఇచ్చి చంపేయండి: న్యాయమూర్తి ఎదుట వాపోయిన నటుడు దర్శన్

Date : 09 September 2025 06:35 PM Views : 202

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : జైలులో ఉండలేకపోతున్నానంటూ జడ్జిని వేడుకున్న నటుడు దర్శన్ జైల్లో సూర్యరశ్మి చూడలేదు... ఫంగస్ భయపెడుతోందని ఆవేదన అలాంటివి కుదరదని స్పష్టం చేసిన న్యాయమూర్తి రేణుకాస్వామి హత్య కేసులో వీడియో కాన్ఫరెన్సులో హాజరు అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్ కోర్టు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట తన ఆవేదనను వ్యక్తం చేశారు. జైలు పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, తాను ఇక బతకలేనని, తనకు విషమిచ్చి చంపేయాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. విచారణలో భాగంగా మంగళవారం 64వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఎదుట దర్శన్‌ను జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తితో మాట్లాడుతూ దర్శన్ తన గోడును వెళ్లబోసుకున్నారు. "చాలా రోజులుగా నేను సూర్యరశ్మి చూడలేదు. ఫంగస్ భయపెడుతోంది. నేను వేసుకున్న బట్టలు కూడా దుర్వాసన వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను బతకలేను. దయచేసి కనీసం నాకు విషం ఇవ్వండి. ఇక్కడ జీవితం అత్యంత దుర్భరంగా ఉంది" అని తీవ్ర ఆవేదనతో అన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, "అలాంటివి చేయడం కుదరదు, అది సాధ్యం కాదు" అని స్పష్టం చేశారు. చిత్రదుర్గకు చెందిన తన అభిమాని రేణుకాస్వామి (33)ని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో దర్శన్‌ను 2024 జూన్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దర్శన్ సన్నిహితురాలైన పవిత్రా గౌడకు రేణుకాస్వామి అసభ్యకర సందేశాలు పంపడమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో గతంలో కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్న ఆందోళనలతో సుప్రీంకోర్టు 2025 ఆగస్టు 14న ఆ బెయిల్‌ను రద్దు చేసింది. జైల్లో ఆయనకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించవద్దని కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో దర్శన్‌ను తిరిగి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో 13, 14వ నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లను న్యాయస్థానం విచారించింది. నిందితులపై అభియోగాల నమోదును సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. తనను బళ్లారి జైలుకు తరలించవద్దని, తనకు బెడ్, పరుపు వంటి సౌకర్యాలు కావాలని దర్శన్ కోర్టును అభ్యర్థించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :