Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Rukshar Dhillon : వద్దని చెప్పినా ఫోటోలు తీస్తున్నారు.. హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ ఎవరిపై ఫైర్ అయింది? క్లారిటీ ఇదే.. కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా తెరకెక్కుతున్న ‘దిల్ రూబా’ సినిమా మార్చ్ 14న రానుంది. నిన్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ.. నేను సౌకర్యంగా లేను అని చెప్పినా కొంతమంది ఫోటోలు తీస్తున్నారు. వద్దని చెప్పినా ఫొటోలు తీయడం రైటా? తప్పా? ఫోటోలు తీయొద్దు అని ప్రేమగా చెప్పినా వినిపించుకోలేదు. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. దీంతో రుక్సర్ థిల్లాన్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఒక సీనియర్ జర్నలిస్ట్ ని ఉద్దేశించి చేసిందని పలువురు భావించారు. ఆ సీనియర్ జర్నలిస్ట్ రెగ్యులర్ గా సినిమా ఈవెంట్, సినిమాలలో హీరోయిన్స్ ని ఫోటోలు తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. గతంలో దిల్ రూబాకు చెందిన ఈవెంట్లోనే రుక్సర్ థిల్లాన్ క్లోజ్ ఫోటో ఒకటి తీసి పెట్టాడు. రుక్సర్ ఇతన్నే అంటుందని అంతా అనుకున్నారు. అయితే హీరో కిరణ్ అబ్బవరం దీనికి, ఆ సీనియర్ జర్నలిస్ట్ కి ఏం సంబంధం లేదు అని క్లారిటీ ఇస్తూ ట్వీట్ కూడా చేసాడు.
Admin
Studio18 News