Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఏఆర్ రెహమాన్ కోలుకున్నారని, మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జి చేశామని చెన్నై అపోలో వైద్యులు ప్రకటించారు. ఈమేరకు అపోలో మేనేజ్ మెంట్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం రాత్రి అస్వస్థతకు గురైన ఏఆర్ రెహమాన్ ను ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఛాతి నొప్పితో బాధపడుతున్న రెహమాన్ ను అపోలో స్పెషలిస్టుల వైద్య బృందం పరీక్షించింది. గ్యాస్ట్రిక్ ట్రబుల్, డీహైడ్రేషన్ కారణంగా రెహమాన్ అస్వస్థతకు గురయ్యారని తేల్చింది. చికిత్స తర్వాత రెహమాన్ కోలుకున్నారని, మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జి చేసి ఇంటికి పంపించామని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన సోదరి రిహానా వెల్లడించారు.
Admin
Studio18 News