Monday, 19 January 2026 08:49:20 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Thaman: అఖండ 2 కోసం పండిట్ మిశ్రా బ్రదర్స్‌ను రంగంలోకి దింపిన తమన్

Date : 13 October 2025 06:25 PM Views : 119

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న అఖండ 2: తాండవం వేదమంత్రోచ్చారణకు పండిట్ మిశ్రా బ్రదర్స్ తెరపై నందమూరి బాలకృష్ణ తాండవం చేస్తూ శత్రు సంహారం చేస్తుంటే, నేపథ్యంగా గంభీర స్వరంలో వినిపించే సంస్కృత శ్లోకాలు ప్రేక్షకుల్లో ఉర్రూతలూగించే అనుభూతిని కలిగిస్తాయి. అదే అనుభూతిని మళ్లీ పునరావృతం చేయడానికి సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్ సన్నద్ధమవుతున్నారు. ‘అఖండ 2: తాండవం’ సినిమా కోసం తమన్ ప్రత్యేకంగా పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదర ద్వయాన్ని రంగంలోకి దింపారు. సంస్కృత శ్లోకాలు, వేదమంత్రాల పఠనంలో నిష్ణాతులైన వీరి స్వరాలు సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి ఆధ్యాత్మికత, మహిమాన్వితత కలగజేస్తాయన్న నమ్మకంతో తమన్ ఈ ప్రయత్నం చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. బాలకృష్ణ కథానాయకుడిగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆధ్యాత్మికతతో కూడిన యాక్షన్ విజువల్ స్పెక్టకిల్‌గా తెరపైకి రానుంది. సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమర్పకురాలు ఎం. తేజస్విని నందమూరి. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ స్వరంలో శక్తిమంతమైన సంగీతం, మిశ్రా బ్రదర్స్ వేదోచ్చారణలు, బోయపాటి దర్శకత్వ దృక్పథం కలిసి ఈసారి బాక్సాఫీస్ వద్ద మరో అఖండ స్థాయిలో తాండవం చేయబోతున్నాయని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :