Tuesday, 03 December 2024 05:28:55 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

బలగం' వేణు 'యెల్లమ్మ' కథకు హీరో ఫిక్స్!

నితిన్‌ హీరోగా 'యెల్లమ్మ' చిత్రం అధికారికంగా ప్రకటించిన 'దిల్‌'రాజు వచ్చే ఏడాది జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం

Date : 12 November 2024 04:10 PM Views : 62

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణ యాసను నేపథ్యంగా తీసుకుని, వాటికి బలమైన కుటుంబ భావోద్వేగాలను జత చేసి కమెడియన్‌ వేణు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. విశేషమైన జనాదరణతో ఈ చిత్రం తెలుగు సినిమాల్లో వన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ సినిమాగా నిలిచింది. అంతేకాదు ప్రతి గ్రామంలో ఈ చిత్రం తెరలు కట్టుకుని మరీ చూశారంటే ఈ చిత్రం వాళ్ల హృదయాలను ఎంతలా హత్తుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై 'దిల్‌'రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా 'బలగం' తరువాత దర్శకుడు వేణు 'యెల్లమ్మ' అనే డివోషనల్‌ టచ్‌ వున్న ఓ కథతో రెడీ అయ్యాడు. మొదట్లో ఈ చిత్ర కథను హీరో నానికి వినిపించాడు. అయితే నాని గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోవడంతో, వేణు గత కొంతకాలంగా ఈ కథకు సూట్ అయ్యే మరో హీరో కోసం అన్వేషిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ కథ, హీరో నితిన్‌కు నచ్చడంతో ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత 'దిల్‌'రాజు కన్‌ఫర్మ్‌ చేశాడు. 'బలగం' వేణు-నితిన్‌ కాంబినేషన్‌లో 'యెల్లమ్మ' చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌ మీదకు వెళ్లనుందని దిల్‌ రాజు తెలియజేశారు. ప్రస్తుతం తమ సంస్థలో రామ్‌చరణ్‌తో 'గేమ్‌ ఛేంజర్‌', వెంకటేష్‌ -అనిల్‌ రావిపూడి కలయికలో 'సంక్రాంతికి వస్తున్నాం' నితిన్‌తో 'తమ్ముడు', విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా, ఆశిష్‌తో 'సెల్ఫీష్‌' సినిమాలు నిర్మిస్తున్నానని 'దిల్‌ రాజు ఈ సందర్భంగా తెలియజేశారు.

Also Read : ఖర్గే తెలంగాణకు వచ్చి మేకల వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో చూడాలి: కేటీఆర్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు